ఒక్క మగాడు సినిమా భారీ పరాజయం దిశగా సాగుతోంది. రోజు రోజుకీ క్షీణిస్తున్న కలెక్షన్లు బయ్యర్లకు భారీ నష్టాలు రావడం ఖాయమని తేల్చాయి. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడంతో నిర్మాత వైవీఎస్ చౌదరి ముందే సేఫ్ అయ్యారు. అయితే భారీ మొత్తాలకు సినిమాను కొన్న బయ్యర్లు నష్టాల లెక్కలు అంచనా వేసి వైవీఎస్కు తమ గోడు వెళ్లబోసుకున్నారట. ఒకవేళ ఒక్క మగాడు సినిమాతో నష్టాలు వస్తే తన తదుపరి చిత్రాన్ని వారికే తక్కువ ధరలకు ఇస్తానని వైవీఎస్ అభయం ఇచ్చారని ఫిలిం నగర్ భోగట్టా. దేవదాసు హీరో రామ్ తో వైవీస్ రేయ్ చిత్రాన్ని రూపొందించనున్నారని ప్రస్తుత టాక్.