ప్రముఖ హీరో, నిర్మాత తనయుడు అయిన ఒక యువ కథానాయకుడు రాజకీయ నేపధ్యం ఉన్న ఒక నిర్మాత మనవరాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఫిల్మ్ నగర్లో పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్ట పడుతున్నారని, తరచూ ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఆ యువ హీరోకు సంబంధించిన వేడుకలలో ఆమె పాల్గొంటూ ఉండడం ఈ రూమార్కు బలాన్ని ఇస్తోంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి కబురు వెలువడవచ్చునట. అయితే ఇంత వరకు వీరిద్దరూ పబ్లిక్‌లో కలిసి మాట్లాడుకుంటూ కెమెరాలకు చిక్కలేదు. పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఒకే చోట ఉన్నా కూడా ఇద్దరూ దూరంగానే ఉంటూ ఉంటారు. పెద్దల ద్వారా వార్త బయట పడే వరకు ఈ పెళ్లి కబుర్లను పుకార్లుగానే పరిగణించాలి.