విక్రమ్ హీరోగా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ‘మల్లన్న’ (తమిళంలో ‘కందసామి’) సినిమాను చేస్తున్నాడు. మణిరత్నం శిష్యుడు సుశీ గణేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రియ నాయిక. ఈ సినిమా తర్వాత విక్రమ్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తానని ఇప్పటికే తెలిపాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అతను నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విక్రమ్ తన ఆలోచనను మార్చుకున్నట్లు తమిళ చిత్రసీమలో వినిపిస్తోంది. దానికి కారణం ‘పరుగు’ సినిమాను అతను రూపొందించిన తీరనేది అంతర్గత వర్గాల కథనం. ఆ వర్గాల ప్రకారం చెన్నైలో ‘పరుగు’ సినిమాను చూసిన విక్రమ్ అసంతృప్తి చెందాడు. అందుకే తెలుగు స్ట్రెయిట్ సినిమాను మరి కొంతకాలం వాయిదా వేసుకున్నాడు. ‘మల్లన్న’ తర్వాత ‘దశావతారం’ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్లో తమిళ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సినిమా జూన్లో లాంఛనంగా ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాలో భాస్కర్ ఎవరిని డైరెక్ట్ చేస్తాడన్నది ఆసక్తికరం.