యువ హీరో ఉదయ్ కిరణ్ ‘వియ్యాలవారి కయ్యాలు’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సినిమాలో అతను నేహా జుల్కాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నిజ జీవితం విషయానికి వస్తే నాలుగేళ్ళ క్రితమే అతను పెళ్ళికి దగ్గరగా వచ్చి కేవలం ఓ అంగుళం దూరంలో ఆగిపోయాడు. కాగా ఇప్పుడతని తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు సినిమా సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఉదయ్ తల్లి నిరుటి యేడాదే మరణించింది. ఉదయ్ తండ్రి హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంగ్లీష్ దిన పత్రికలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా పరిచయమైన ఓ యువతిని కొద్ది రోజుల క్రితం ఆయన పెళ్లి చేసుకున్నాడనేది ఫిల్మ్ నగర్ కథనం. ఆమె జైన మతుస్తురాలనీ, వయసు 30 యేళ్ల
లోపేననీ చెప్పుకుంటున్నారు.