Title kosam paatlu!

గోపీచంద్ హీరోగా నటించిన ‘లక్ష్యం’తో డైరెక్టర్‌గా పరిచయమైన శ్రీవాసు త్వరలో రెండో సినిమాని డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. హీరో ఎన్టీఆర్ కోసం ఓ సబ్జెక్టుని అతను తయారుచేశాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే టైటిల్ దగ్గరే శ్రీవాసుకు గొడవొచ్చి పడింది. తన కథకోసం అతను ‘శ్రీరామనవమి’ అనే టైటిల్‌ని ఎంపిక చేసుకున్నాడు. తీరా ఆ పేరుని ఫిల్మ్ చాంబర్ వద్ద రిజిస్టర్ చేసుకుందామని వెళ్లేసరికి, అప్పటికే ఆ టైటిల్ రిజిస్టరై ఉంది. డైరెక్టర్ సుకుమార్ వద్ద పనిచేసి, దర్శకుడు కావాలనుకుంటున్న ప్రసాద్ అనే యువకుడు ఆ టైటిల్ని రిజిస్టర్ చేయించుకున్నాడు. హీరో రాజశేఖర్ కోసం తయారు చేసుకున్న సబ్జెక్ట్ కోసం అతనీ టైటిల్ని రిజిస్టర్ చేశాడు. వాస్తవానికి ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మొదలు కావాల్సి ఉండగా, దాని స్థానంలో రాజశేఖర్ ‘గోరింటాకు’ సినిమాని చేస్తున్నాడు. కాగా ఇప్పుడు ‘శ్రీరామనవమి’ టైటిల్ని తనకు ఇవ్వాల్సిందిగా ప్రసాద్‌ని శ్రీవాసు అడుగుతున్నాడనీ, కానీ ప్రసాద్ అందుకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదనీ విశ్వసనీయంగా తెలిసింది. టైటిల్ కోసం శ్రీవాసు  పెద్దమొత్తంలోనే డబ్బు చెల్లించడానికి సిద్ధపడినట్లు కూడా సినీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రసాద్ మాత్రం తన టైటిల్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. ఆ టైటిల్ తన సబ్జెక్టుకి 100 శాతం సరిపోతుందనే భావనతో ఉన్న శ్రీవాసు ఇంకా దానికోసం ప్రయత్నిస్తూనే వున్నాడని ఇన్‌సైడర్స్ చెప్పుకుంటున్నారు.

We would like to hear your comments below: