యువ హీరో తరుణ్ సంచలన తార ఇలియానా సరసన హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమాని కె. విజయభాస్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రెండేళ్లపాటు అవకాశాలు లేని తరుణ్ ఇటీవలే ‘నవ వసంతం’తో సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలు పెట్టాడు. ఆ సినిమా సరిగా ఆడకపోయినా ఇప్పుడు ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీనికి అతడిలో సంతోషం కనిపించాలి. కానీ అతడిలో అ సంతోషానికి బదులు దిగులు కనిపిస్తున్నదని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దానికి రెండు కారణాలంట. ఒకటేమో తనకంటే హీరోయిన్ ఇలియానాకు ఎక్కువ పారితోషికం లభించడం, రెండోది జుట్టు గురించిన బెంగ అనేది ఆ వర్గాల కథనం. తరుణ్ జుట్టు బాగా రాలిపోతున్నదనీ, నుదుటివద్ద ఇప్పటికే కొంత జుట్టు రాలి, తల నున్నగా కనిపిస్తున్నదనీ, దాన్ని కవర్ చేయడానికి వెనుకవున్న వెంట్రుకల్ని ముందుకు లాక్కుంటున్నాడనీ చెప్పుకుంటున్నారు. ఇంకా పెళ్లికాని కుర్రా