వరుసగా నిర్మాతలకు లాభాలు చేకూర్చిన సినిమాలు చేస్తూ వస్తున్న దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ఆయనతో ఒక సినిమా నిర్మించాలని లార్స్కో ఎంటర్టైన్మెంట్స్ అధినేత లగడపాటి శ్రీధర్ సంకల్పించారు. శ్రీకాంత్‌ను హీరోగా ఎంచుకుని, దానికి ‘భలే ఛాన్సులే’ అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. అయితే తాజాగా ఆ ప్రాజెక్టు నుంచి శ్రీనివాసరెడ్డి తప్పుకున్నాడని తెలిసింది. ప్రతి అంశంలోనూ శ్రీధర్ మితిమీరిన జోక్యం చేసుకుంటూ వుండటం వల్ల తనకు స్వేచ్ఛ వుండటం లేదని శ్రీనివాసరెడ్డి భావించాడనీ, అందుకే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడనీ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ సినిమాను కల్పనా ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థకు చేయడానికి అంగీకరించాడు శ్రీనివాసరెడ్డి. ఆ సంస్థ ఇటీవలే గోపిక, రిషి, సమ్రాట్ కాంబినేషన్‌తో ‘వీడు మామూలోడు కాదు’ సినిమాను నిర్మించింది. హీరో మాత్రం శ్రీకాంతే. కాగా శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం శ్రీధర్‌ను ఖంగు తినిపించిందనీ, తన వ్యవహార సరళి విషయమై పునరాలోచిస్తున్నాడనీ చెప్పుకుంటున్నారు.