టీవీ5 చానల్లో ఏం జరుగుతోంది? టీవీ9 సూపర్ హిట్టవడంతో రంగంలోకి వచ్చిన ఈ చానల్లో ఇప్పుడు అంతా సవ్యంగా లేదని వినిపిస్తోంది. ఇప్పటికే ఛైర్మన్ బివి నాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ మధ్య వచ్చిన పొరపొచ్చాలు ప్రసాద్ రాజీనామాకు దారి తీశాయి. నాయుడు ఇదివరకు రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఒక పెళ్లాం ముద్దు రెండో పెళ్లాం వద్దు’ అనే సినిమాని నిర్మించారు. ఇప్పుడు మరో సినిమాను నిర్మిస్తున్నారు. కాగా టాలీవుడ్ అంతర్గత వర్గాల్లో టీవీ5కు సంబంధించిన ఒక అంశం చర్చకు వస్తోంది. ఒక వివాదాస్పద స్వామికి ఈ ఛానల్లో కొంత వాటా ఉన్నదనేది ఆ అంశం. ఆ స్వామి పెనుకొండకు చెందిన శ్రీ కాళేశ్వరస్వామి. తనను తాను అపర శక్తివంతుడిగా, మహిమ కలిగినవాడిగా ప్రచారం చేసుకునే కాళేశ్వర్‌పై ఇప్పటికే పలు వివాదాలు వున్నాయి. ఆయనకు టీవీ5లో వాటా ఉన్నదనే సంగతి నిజమైతే ఒక వివాదస్పద స్వామి మీడియాలో అడుగుపెట్టడం మన రాష్ట్రంలో ఇదే ప్రథమం. ఆయన వల్లే టీవీ5 పూర్తిగా టిడిపికి అనుకూల ధోరణిని అనుసరిస్తున్నదని కూడా ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.