Sivaji’s desire on Sangita?

బొద్దుగా ఉండే చెన్నై భామ సంగీత చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. ఆ సినిమా పేరు ‘మా ఆయన చంటి పిల్లాడు’. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శివాజీ హీరో. ఇందులో మరో హీరోయిన్ కూడా వుంది. ఆమె మీరా జాస్మిన్. నిజానికి సినిమాలో శివాజీకి తొలి హీరోయిన్ మీరానే. మొదట ఆమెను పెళ్లి చేసుకున్న శివాజీ అనుకోని పరిస్థితుల్లో సంగీతను రెండో భార్యగా చేసుకుంటాడు. కొద్ది సంవత్సరాల క్రితం తమిళంలో వచ్చిన హిట్ సినిమా ‘ఎన్ పురుషన్ కుళంద మాదిరి’కి ఇది రీమేక్. కాగా తమిళంలో వింధ్య చేసిన పాత్రకు సంగీతనే నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఎందుకు తీసుకున్నారు. ఫిల్మ్ నగర్ అంతర్గత వర్గాల్లో ప్రచారమవుతున్న దాని ప్రకారం అది శివాజీ చాయిస్. బక్కగా వుండే అతడికి బొద్దుగా వుండే సంగీత ఎలా సూటవుతుంది? సంగీతతో నటించడం శివాజీకి ఇదే ప్రథమం కాదు. రెండేళ్ల క్రితం ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాలో ఆ ఇద్దరూ కలిసి నటించారు. అందులోనూ సంగీతది సెకండ్ హీరోయిన్ పాత్రే.. భార్య లయ వుండగా సంగీతపై మోజు పడతాడు శివాజీ. సినిమాలోనే కాకుండా నిజంగానే సంగీత అంటే అతను ప్రత్యేకాభిమానం చూపించాడనీ, ఆ అభిమానంతోటే ‘మా ఆయన చంటిపిల్లాడు’లో ఆమెను రెండో హీరోయిన్ గా ఎంచుకున్నాడనీ కొంతమంది గుసగుసలు పోతున్నారు. అయితే శివాజీ పక్కా ప్రొఫెషనల్ అనీ, ఇవన్నీ ఏ మాత్రం ఆధారంలేని రూమర్లేననీ  శివాజీ గురించి బాగా తెలిసినవాళ్లు చెబుతున్నారు. ఎందుకంటే శివాజీ ‘చంటి పిల్లాడు’ మరి!

We would like to hear your comments below: