బాలీవుడ్ నటి దీపికాపదుకొనే క్రికెటర్ యువరాజ్ సింగ్ తో డేటింగ్ చేస్తున్నదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నటి సమీరారెడ్డి ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మతో డేటింగ్ చేస్తుందనే వార్తలు ఒక్కసారిగా గుప్పు మన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమీరా, ఇషాంత్‌లు ఐ.పి.ఎల్. మ్యాచ్‌లలో కలుసుకున్నారని, ఒకరితో ఒకరు సాన్నిహిత్యం పెంచుకుంటున్నారని, ప్రస్తుతం వారి మధ్య రిలేషన్ ఫ్రెండ్షిప్ దాటి ఒకడుగు ముందుకు వెళ్ళిందని, వారిద్దరు ఒకరికి మరొకరు మెసేజ్‌లు పంపుకుంటున్నారని, ఫోన్ కాల్స్‌తో రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నారని తెలిసింది. ఈమధ్యనే సమీరా రెడ్డి తన బోయ్ ఫ్రెండ్‌కి గుడ్‌బై చెప్పడం, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లలో కనిపిస్తుండటం ఈవార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.