రెనీ, సుస్మిత కూతురా?

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ప్రస్తుతము తన చిరకాల స్వప్నమైన రాణి లక్ష్మీబాయి చిత్ర కధా చర్చలలో హడావిడిగా ఉంది. రాణి లక్ష్మీబాయికి తనకూ చాలా దగ్గర పొలికలు ఉన్నాయని, తనకూ ఆవిడలగే ధైర్యసాహసాలు ఉన్నాయని చెప్పారు. సుష్ కూతురు రెనీ గురించి బాలీవుడ్‌లో ఈ మధ్య ఒక పుకారు వినిపిస్తోంది. రెనీ సుష్ స్వంత కూతురేనని, పెంపుడు కూతురు కాదని అంటున్నారు. దీనికి ఆధారంగా, రెనీకి సుష్‌కి ఉన్న పోలికలు చూపిస్తున్నారు. రెనీ చిన్నగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు పొలికలు బాగా తెలుస్తున్నాయని, సుష్‌కి రెనీ జిరాక్స్‌కాపీ అని అంటున్నారు. మరి దీనికి సుష్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

We would like to hear your comments below: