చిరంజీవి రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు ఆయనను అప్రదిష్ట పాలు చేయడానికి గల అవకాశాలన్నిట్నీ వినియోగించుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇటీవల మంత్రి మారెప్ప "తన ఇంట్లో సమస్యల్నే చక్కదిద్దుకోలేని వాడు ప్రజల సమస్యల్ని ఎలా తీరుస్తాడు?" అంటూ ఎద్దేవా చేయడం అందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో చిరంజీవిపై మరింత బురద జల్లడానికి ఆయన వ్యతిరేక శక్తులు పథక రచన చేస్తున్నాయని వినికిడి. వాటి దృష్టి ఇప్పుడు చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ మీద పడింది. ఇవాళ చాలామంది కుర్ర హీరోలు పబ్బులకెల్లడం సాధారణ విషయమే. అయితే ఈ పబ్‌ల సంస్కృతి తెలుగు సమ్రదాయానికి విరుద్ధమైనదని భావించే వాళ్లు ఎక్కువే. అందుకే రాంచరణ్ ఏ పబ్లోనైనా ఏ మందు బాటిల్తోటో, లేదంటే అమ్మాయిలతో డాన్స్ చేస్తూనో కనిపిస్తే వెంటనే ఫోటోలు తీయడానికి కొన్ని ‘కెమెరాలు’ రంగంలోకి దిగినట్లు అంతర్గత వర్గాల భోగట్టా. ఈ పేజ్ 3 కెమెరాలు ఇప్పుడు రాంచరణ్ కోసం కాసుకు కూర్చుకున్నాయి. అవకాశం దొరికితే ఆ ఫోటోలతో చిరంజీవిని అప్రదిష్ట పాలు చేయాలన్నది వాటిని నియోగించిన శక్తుల ఎత్తుగడ. అంటే.. చిరంజీవి కుమారుడిగా పుట్టినందుకు రాంచరణ్ ఇంకెంత మాత్రమూ స్వేచ్ఛగా తిరగలేడు. కనీసం ఎన్నికల వరకైనా అతను జాగ్రత్తగా నడచుకోవాల్సి వుంది. అల్లు అర్జున్‌కు సైతం ఇది వర్తిస్తుంది.