చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ పెళ్లి త్వరలో జరగబోతోందా? ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఇదే చర్చ. రాయలసీమకు చెందిన ఒక పేరుపొందిన వ్యాపారవేత్త కుమార్తెతో రామ్‌చరణ్ పెళ్లి జరిగే అవకాశముందని ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ వ్యాపారవేత్తకు పలు సాఫ్ట్వేర్ సంస్థల్లో భాగస్వామ్యం వుందనీ, పేరుపొందిన నగరాల్లో కొన్ని బడా హోటళ్లలో భాగస్వామి అనీ తెలుస్తోంది. ఆయనకున్న ఏకైక కుమార్తె ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్నదనీ, ఆ కుటుంబం చిరంజీవి కుటుంబానికి సన్నిహితమనీ వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మను రామ్‌చరణ్ రహస్య వివాహం చేసుకునాడని వదంతులు రావడం, దీన్ని స్వయంగా రామ్‌చరణ్ ఖండించడం తెలిసిందే. అయితే అప్పుడు తను అందరికీ తెలిసేట్లే పెళ్లి చేసుకుంటాననీ, రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తనకు లేదనీ చెప్పిన రామ్‌చరణ్ తనకు ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని మాత్రం చెప్పలేదు. చిరంజీవి ఇద్దరు కుమార్తెలకూ వివాహమైనందున ఇప్పుడు ఆ కుటుంబం రామ్‌చరణ్ పెళ్లి విషయం ఆలోచిస్తున్నదనీ, ప్రముఖమైన కుటుంబానికి చెందినవాడు కావడంతో వదంతులకు ఆస్కారం వుటుంది కాబట్టి వాటికి చెక్చెపాలంటే పెళ్లి ఒక్కటే మార్గమనీ వారు భావిస్తున్నారనీ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్నీ అనుకూలిస్తే 2009లోగా రామ్‌చరణ్ పెళ్లికొడుకయ్యే అవకాశాలున్నాయి.