Raasi in mother’s role!

నిన్నటి దాకా తెలుగులో హీరోయిన్ పాత్రలు చేసిన రాశి పెళ్లి చేసుకున్నాక మళ్లీ వెండితెర మీద కనిపించలేదు. టీవీలో కొద్ది రోజులు ఒక షోకి యాంకర్‌గా దర్శనమిచ్చి మాయమయ్యింది. పెళ్లి తర్వాత ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. స్థూలకాయం వచ్చేసింది. భర్త శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమైన ‘మహారాజశ్రీ’ అనే సినిమా బిగ్ ఫ్లాప్ కావడంతో అందులో పెట్టిన వాటా డబ్బులన్నీ పోయాయి. దాంతో రాశి ఆర్థికంగా కాస్త ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ నటించి కాస్త డబ్బులు వెనకేసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు కనిపిస్తోంది. టాలీవుడ్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఆమె ఒక తమిళ సినిమాలో నటించనున్నది. అదీ తల్లి పాత్రలో. ఎవరికనుకుంటున్నారు.. హీరో శ్రీరామ్‌కు! అవును. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే సమాచారమే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు వినికిడి. ఆ సినిమా దర్శకుడెవరు, అందులో శ్రీరామ్‌కి జోడీగా నటిస్తున్నదెవరనే సంగతులు మాత్రం తెలియరాలేదు. మొత్తానికి రాశి ముప్ఫై యేళ్లు నిండకుండానే హీరోకి తల్లిగా నటించేందుకు సిద్ధమవుతోందన్న మాట. ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? ‘సినీ మాయ’ అంటే ఇదే.

We would like to hear your comments below: