నిర్మాతలకి లారెన్స్ పెద్ద తల నొప్పిగా మారాడు. కొరియోగ్రఫీ నుంచి దర్శకత్వానికి ప్రమోషన్ పొందిన లారెన్స్ మాస్ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. దాంతో అతనికి దర్శకుడిగా ఆఫర్స్ వెల్లువెత్తాయి. ముందుగా లగడపాటి శ్రీధర్ స్టైల్ చిత్రాన్ని లారెన్స్ నిర్మించారు . ఆ చిత్రం యావరేజ్ అనిపించుకుంది కానీ కాస్ట్ ఫెయిలయూర్ అయింది. ఇందుకు కారణం లారెన్స్ ఆ చిత్రానికి పెట్టించిన ఖర్చు అవధులు దాటి పోవడమే. లెక్క లేకుండా నిర్మాతతో అతను ఖర్చు పెట్టించడంతో చివరకు ఆ చిత్రం పెట్టుబడి రాబట్టుకోలేక పోయింది. బడ్జెట్ అవధులు దాటడం వలన లగడపాటి కి, లారెన్స్ కి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయని చెప్పుకున్నారు. తాజాగా లారెన్స్ డాన్ సినిమాతో తన ప్రతాపం ఎమ్.ఎల్. కుమార చౌదరికి చూపించాడు. ఈ చిత్రానికి లారెన్స్ శ్రుతి మించి ఖర్చు చేయించాడు. అతని మీద నమ్మకంతో చౌదరి కూడా ఏమనకుండా అడిగినంత ఖర్చు పేటారు. అలా ఖర్చులు పెరిగి, పెరిగి నాగార్జున హయ్యెస్ట్ బిజినెస్ రేంజ్ కంటే ఎక్కువ అయిపోయింది బడ్జెట్. దీంతో సినిమా బిజినెస్ జరగలేదు. నిర్మాత అతి కష్టం మీద డెఫిషీట్ లోనే సినిమా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయనను మరిన్ని కష్టాల్లో పడేస్తూ డాన్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నిర్మాతల అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇతరులు లారెన్స్ తో సినిమా అంటేనే భయపడి పోతున్నారని ఫిలిం నగర్ టాక్. లారెన్స్ కూడా తెలివైన వాడే. తదుపరి చిత్రాన్ని తమిళంలో చేస్తున్నాడు!