Producer garam garam on Akash!

కొన్నేళ్ల క్రితం వచ్చిన ‘ఆనందం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న తమిళుడు ఆకాష్ ఆ తర్వాత అనుకున్నంతగా తెలుగులో రాణించలేకపోయాడు. తమిళంలోనూ అతని పరిస్థితి అలాగే ఉంది. ఇటీవల అతను సోలో హీరో పాత్రలనే గాక సెకండ్ హీరో, అతిథి పాత్రలని సైతం చేస్తున్నాడు. ఆమధ్య అతను తమమీద దౌర్జన్యం చేసినట్లు ఓ నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయగా, చివరకి ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిర్చింది కౌన్సిల్. కాగా ఇప్పుడు మరో నిర్మాత అతని మీద కారాలు, మిరియాలు నూరుతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆకాష్ హీరోగా ఓ సినిమాని నిర్మించే ఉద్దేశంతో ఆ నిర్మాత ఇప్పటికే అడ్వాన్స్ కూడా చెల్లించాడట. అయితే అందులో హీరోయిన్ దగ్గర్నుంచి, సహాయ నటీనటులు, టెక్నీషియన్లని తన మాట ప్రకారమే తీసుకోవాలని ఆకాష్ పేచీపెడుతున్నాడంట. దాంతో విసిగిపోయిన ఆ నిర్మాత ఈ విషయమై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ఫిర్యాదుచేసి, తన అడ్వాన్సును తిరిగి రాబట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

We would like to hear your comments below: