సుమంత్ హీరోగా రూపొందిన పౌరుడు చిత్రం జనవరి 13న విడుదల కి సిద్ధపడింది. సుమంత్ సొంత బ్యానర్‌పై నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం పాటలు ఆదరణ పొందాయి. తన కెరీర్లో బిగ్ హిట్‌గా నిలిచే చిత్రమిదని సుమంత్ నమ్ముతున్నాడు. కాగా ఈ చిత్రం తమిళంలో వచ్చిన అజిత్ కుమార్ సినిమా కిరీడం కి ఫ్రీమేక్ అని తెలుస్తోంది. ఆ చిత్రంలో హీరో పోలీస్ అయ్యేందుకు ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ ఇందులో సుమంత్ ఐఏఎస్ అవడం కోసం కృషి చేస్తాడు. పూర్తిగా అదే కథ కాకపోయినా కిరీడం నుంచి బాగా ఇన్‌స్పయిర్ అయినట్టు ఫిలిం నగర్ సమాచారం. ఇది నిజమో కాదో పౌరుడు విడుదల అయ్యాకే తెలుస్తుంది. మరో విశేషం ఏమిటంటే అజిత్ కిరీడం మలయాళంలో అదే పేరుతో 20 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాకు రీమేక్. అప్పట్లో ఆ చిత్రాన్ని రాజశేఖర్ తెలుగులో రౌడీయిజం జిందాబాద్ పేరిట రీమేక్ చేశారు.