దర్శకుడిగా మారిన మాటల రచయిత పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ‘ఆపద మొక్కులవాడు’ అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఇందులో టైటిల్ రోల్‌ని నాగబాబు పోషిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే పోసాని డైరెక్షన్లో ఓ సినిమాని నిర్మించేందుకు ఓ నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఆయన మాగంటి గోపీనాథ్. ఇదివరకు ఆయన తారకరత్న హీరోగా ‘భద్రాది రాముడు’ అనే సినిమాని సురేష్‌కృష్ణ దర్శకత్వంలో నిర్మించారు. అది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాపవడంతో ఆయన బాగా నష్టపోయారు. ‘ఆపరేషన్ దుర్యోధన’తో దర్శకుడిగా తొలి విజయాన్ని సాధించిన పోసాని ఆయనకు ఆశాకిరణంగా కనిపించారు. అందుకే ఆయన డైరెక్షన్లో సినిమా తీయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.