సూపర్ హిట్ ఫిల్మ్ ‘మనసంతా నువ్వే’లో ‘తూనీగా తూనీగా’ పాటకి నటించిన బాల నటి బేబీ సుహానీ ఇప్పుడు మిస్ సుహానీగా మారి ‘సవాల్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. అయితే ఆ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఆమె పాత్ర మరీ నాసిరకంగా వుందనే విమర్శలు వచ్చాయి. ఆ పాత్రలో ఆమె నటన కూడా ప్రమాణాలకు తగ్గట్లు లేదనీ, ఆమె హావభావాలు సన్నివేశాలకు తగ్గట్లు లేవనీ విమర్శకులు పెదవి విరిచారు. కాగా ఇటీవల ఆమె బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోబోతున్నదనే రూమర్లు వచ్చాయి. సన్నిహితులు, తల్లి సూచన మేరకు ఆమె సిలికాన్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నదని వినిపించింది. అయితే అటువంటిదేమీ లేదని సుహానీ వివరణ ఇచ్చింది. అసలు ఇంతకీ ఈ రూమర్ రావడానికి కారణం ఒక ప్రముఖ దినపత్రిక ఫోటోగ్రాఫర్ ఆమెతో ప్రవర్తించిన తీరేనని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం ఆ ఫోటోగ్రాఫర్ ఆమెతో ఫోటో సెషన్ చేశాడు. ఆ సమయంలో అతను ఆమెకు డ్రెస్ మార్చుకుని స్తనాల వద్ద పాడింగ్ పెట్టుకొనమని సలహా ఇచ్చాడు. ఆమె స్తనాలు బరువుగా వున్నట్లు కనిపించాలని చెప్పాడు. దాంతో సుహానీ ఒక్కసారిగా ఖంగుతింది. ఆ ఫోటోగ్రాఫర్ తనతో మాట్లాడిన విధానం, ప్రవర్తించిన తీరు ఆమెకు మనస్థాపం కలిగించాయి. ఆ ఫోటోగ్రాఫర్‌ని అలా మాట్లాడవద్దని కోపంగా చెప్పిన ఆమె, ఆ తర్వాత తన కెరీర్‌ను దృష్టిలో వుంచుకుని మౌనం వహించింది. ఈ అనుభవం వల్లే ఆమె సిలికాన్ ప్లాంటేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నడనే వదంతి బయటకి వచ్చిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.