నిర్మాత బెల్లంకొండ సురేష్ దేనికైనా పట్టు పట్టాడంటే, దాన్ని సాధించిందాకా నిద్రపోడనే పేరుంది. మంచి మంచి కాంబినేషన్స్‌తో సినిమాలు తీయాలని ఆయన తపిస్తుంటారు. అలా ‘ఆది’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మీ నరసింహా’, ‘భలే దొంగలు’ వంటి సినిమాలు నిర్మించిన ఆయన బాలకృష్ణతో ‘సాధు’ నిర్మించాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టు యమ్మెస్ రాజు చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఆయన భావిస్తున్నట్లు టాలీవుడ్ అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వర్గాల కథనం ప్రకారం ఈ విషయమై ఇప్పటికే ఆయన అల్లు అరవింద్‌ను సంప్రదించారు. అరవింద్ దానికి సానుకూలంగా స్పందించారు. ‘పులి’ తర్వాత ఆ సినిమాను ప్లాన్ చేసుకొమ్మని హామీ కూడా ఇచ్చారు. అయితే ఈలోగా పవన్‌కు కథచెప్పి, ఆయనను మెప్పించాల్సి వుంటుంది. అయితే ఏ దర్శకుడితో ఈ సినిమాను బెల్లంకొండ ప్లాన్ చేస్తున్నారనే సంగతి మాత్రం బహిర్గతం కాలేదు. ఈ కథనంలోని నిజానిజాల సంగతి త్వరలో తెలియనున్నది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమే అయితే అది టాక్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ అవడం తథ్యం.