Parvathi Melton in love!

చారడేసి కళ్ల పంజాబీ సుందరి పార్వతీ మెల్టన్ ‘జల్సా’ సినిమా తర్వాత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షకుల్లోనూ పాపులారిటీ సంపాదించింది. ఇదివరకు ప్రధాన హీరోయిన్‌గా చేసిన సినిమాల్లో రాని పేరు, ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేయడం ద్వారా లభించింది. పవన్ కల్యాణ్ తదుపరి సినిమా ‘పులి’లోనూ ఆమెకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే మహేష్ సినిమా ‘వరుడు’లో రెండవ హీరోయిన్‌గా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అంటే అటు హీరోనీ, ఇటు డైరెక్టర్‌నీ ఆమె ఏక కాలంలో ఇంప్రెస్ చేసిందన్న మాట. కాగా ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కుమారునితో ప్రేమలో పడిందనేది ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న హాట్ హాట్ న్యూస్. ఆ వ్యాపారవేత్తకు హైదరాబాద్‌లో పెద్ద షాపింగ్ మాల్ ఉంది. తన తీరికవేళల్లో ఆమె అతడి సమక్షాన్ని కోరుకుంటున్నదనీ, ఇద్దరూ హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్స్‌లో అప్పుడప్పుడూ గడుపుతున్నారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఒక యువ హీరో ఆమె ప్రేమలో పడ్డాడనీ, ఆమెను పెళ్లి చేసుకుంటానికి కూడా రెడీ అన్నాడనీ కూడా చెప్పుకుంటున్నారు. కానీ పార్వతి ఆ హీరోకు ‘సారీ’ చెప్పిందని వినికిడి.

We would like to hear your comments below: