PARUGU bombed at box-office?

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ‘పరుగు’ సినిమా డివైడ్ టాక్‌తో నడుస్తోంది. సినిమాకి అర్జున్ ఇమేజే ప్రధాన ఆటంకంగా మారిందని సర్వత్రా వినిపిస్తోంది. తమ హీరోను ‘దేశముదురు’ వంటి హీరోయిజం నిండిన పాత్రలో చూసిన అభిమానులు, యాభై నుంచి వందమంది రౌడీల్ని ఈజీగా చావగొట్టడం చూసి కేరింతలు కొట్టిన అభిమానులు ‘పరుగు’లోని పాత్రను చూసి, ఎలాంటి వీరోచిత కార్యాలు లేకుండా సాఫ్ట్‌గా సాగిన క్లైమాక్స్‌ను చూసి పెదవి విరుస్తున్నారు. పైగా హీరోయిన్ సినిమాకు మైనస్ అనే పేరు వచ్చింది. ముఖంలో ఏమాత్రం సుందరత్వం గోచరించని షీలా హీరోయిన్‌గా అర్జున్ సరసన ఏమీ బాగాలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఎంతోమంది సుందరాంగులు వుండగా షీలానే ఏరికోరి తీసుకోవడం సినిమాకి నష్టం చేకూర్చింది. అయితే కథాంశం, ప్రథమార్ధ చిత్రణ దర్శకుడు భాస్కర్‌కు మంచి పేరే తెచ్చాయి. కాగా ‘పరుగు’ కథ చిరంజీవి కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహారాన్ని పోలి వున్నదనే ప్రచారం మొదలవడం వల్ల అది సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని కొద్దో గొప్పో రేకెత్తించే అవకాశాలున్నాయి. ఏదేమైనా ‘బొమ్మరిల్లు’తో ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్న దర్శకుడు భాస్కర్ ‘పరుగు’ విషయంలో దాన్ని సాధించలేక పోతున్నాడనేది స్పష్టం. అందుకే విడుదలైన రెండవ రోజుకే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా చప్పబడింది.     

We would like to hear your comments below: