ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘యమదొంగ’లో ఎన్టీఆర్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. కారణం మునుపటి ఆకారానికి పూర్తి విరుద్ధంగా సన్నగా అవడం. అంతకుముందు కృష్ణవంశీ తీసిన ‘రాఖీ’లో అతను ‘బోండాం’లా కనిపించాడు. హీరోయిన్ ఇలియానా కూడా అదే అని ఆట పట్టిస్తూ ఉంటుంది. అంత లావుగా ఉన్న అతన్ని పట్టు పట్టి స్లింగా తయారయ్యేలా చేశాడు రాజమౌళి. ‘యమదొంగ’ కోసం దాదాపు 25 కిలోల బరువు తగ్గాడు ఎన్టీఆర్. చాలామంది అతని కొత్త రూపాన్ని ఇష్టపడ్డారు. కొంతమంది పాత రూపమే బావుందన్నారు. ఏదేమైనా ‘యమదొంగ’ బాగానే ఆడింది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘కంత్రి’గా నటిస్తున్నాడు. ఇప్పటికే అతను కాస్త బరువు పెరిగాడని వినిపిస్తోంది.అతనలా క్రమేణా బరువు పెరుగుతూ పోతే ఒకే సినిమాలో అతను రకరకాల ఆకారాల్లో కనిపిస్తాడని రమేష్ భయపడుతున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. బరువు పెరిగినా, పెరగక పోయినా ఒకే ఆకారాన్ని మైంటైన్ చేస్తే బెటరని అతను ఆశిస్తున్నాడు. ‘కంత్రి’గా అతను ఎలా కనిపిస్తాడో చూద్దాం.