ఒకప్పుడు హీరోగా నటించి, కొంతకాలంగా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన ఓ నటుడు టెలివిజన్ వైపు దృష్టి పెట్టి ‘మనసే మందిరం’ అనే సీరియల్లో నటించాడు. దాని నిర్మాణంలోనూ పాలుపంచుకున్నాడు. బెంగుళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా వస్తున్న సంపాదనతో కొంతకాలంగా సొంతంగా టీవీ సీరియల్స్ నిర్మించాలని ప్రయత్నిస్తున్న అతను ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఆఫీసుని సైతం తెరిచాడు. అప్పట్నించీ పలువురు దర్శకుల్ని పిలిపించి చర్చలు సాగిస్తూ వచ్చాడు. అయితే వారంతా తమిళులే కావడం గమనార్హం. అలా దాదాపు 40 మందితో అతను చర్చించినట్లు వినిపిస్తోంది. అయినప్పటికీ అతను ఏ ఒక్క తెలుగు టీవీ సీరియల్ డైరెక్టర్నీ సంప్రందించక పోవడం చాలామందికి విడ్డూరంగా తోస్తోంది. తెలుగు సినిమాల్లోనే ఎక్కువ అవకాశాలు పొంది, తెలుగు సీరియల్తోటే టీవీ ప్రేక్షకులకీ దగ్గరైన అతను ఇలా వ్యవహరించడం ఏమాత్రం సబబని వారు ప్రశ్నిస్తున్నారు.