Nayanatara in smoking zone?

నటిగా ఎంత పేరు సంపాదించుకుందో వివాదాలతోనూ నయన తార అంతే పేరు దక్కించుకుంది. పొగరుబోతు కథానాయికగా ముద్ర పడ్డ నయనతార తనకు నచ్చింది చేయడంలో వెనకడుగు వేయదు. శింబు గురించి అంతా వారిస్తున్నా కూడా అతనితో ప్రేమాయణం సాగించిన నయనతార అతనితో చెడ్దాక కానీ అతని పద్ధతి తెలుసుకోలేకపోయింది. అతనితో ముద్దుల వ్యవహారం కూడా కానిచ్చిన ఆమె ఆ ఫోటోలు శింబు తీస్తున్నా అడ్డు పడలేదు. దాంతో వాటిని పత్రికల్లో చూసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కాస్త మారినట్టు కనిపిస్తున్న నయనతారకి కొన్ని వెస్టరన్ అలవాట్లు ఉన్నాయని, వాటిని కూడా ఆమె దాచుకోదని గాసిప్. నయనతారకి సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందట. కానీ దానిని దాచుకునేందుకు ఆమె ప్రయత్నించదట. ఇలాంటి అలవాట్లు ఉన్న వారు ఎందరో ఉంటారు కానీ బయటపడి బ్యాడ్ నేమ్ తెచ్చుకునేది ఎందరు? బహుశా తనకి ఉన్న హ్యాబిట్ తప్పు కాదని ఆమె భావిస్తున్నదేమో.

We would like to hear your comments below: