నవదీప్, కాజల్.. లవ్‌బర్డ్స్?
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘చందమామ’లో జంటగా నటించిన నవదీప్, కాజల్ అగర్వాల్ మధ్య ప్రేమ చిగురించిందా? అవునని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘చందమామ’ విడుదలై చాలా రోజులైనా, ఆ ఇద్దరూ తరచూ కలుసుకుంటున్నారనీ, చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారనీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. తేజ రూపొందించిన ‘జై’ సినిమాతో హీరోగా తెరగేట్రం చేసిన నవదీప్ తొలి హిట్ కోసం మూడేళ్ల సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది. ‘చందమామ’ అతడికి ఆ హిట్‌ని అందించింది. నవదీప్, కాజల్ జంట బాగుందని ప్రేక్షకులు సైతం భావించారు. ఆ సినిమా సెట్స్ మీద ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని ఇన్సైడర్స్ భావిస్తున్నారు. నిజంగానే ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారో, లేదో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.