Krishnarjuna upset Nag’s fans

డాన్ చిత్రాన్ని ఫ్లాప్ అని మీడియా తొలి రోజే తేల్చేసింది. అయినప్పటికీ డాన్ కొద్ది రోజులు కలెక్షన్లు మెరుగ్గా సాధించి నాగార్జున అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. అందుకు తగ్గట్టే నాగార్జున కూడా డాన్ చిత్రాన్ని, లారెన్స్ ని వెనకేసుకుని వచ్చి మాట్లాడారు. నాగార్జున సృష్టించిన హైప్‌తో డాన్ 50 రోజుల సెంటర్స్ పరంగా నాగార్జున చిత్రాల్లో రికార్డుగా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ విడుదల అయిన 40 రోజులకే నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించిన కృష్నార్జున చిత్రం వచ్చి అత్యధిక కేంద్రాల్లో డాన్ ని రీప్లేస్ చేస్తోంది. తమ హీరో సినిమా 50 రోజులయినా పూర్తి కాకుండానే దీనిని విడుదల చేయడం ద్వారా డాన్ సినిమాకు మరింత నష్టం కలిగించారని నాగార్జున అభిమానులు మోహన్‌బాబు మీద కినుక వహించారు. అయినా అయిపోయిన పెళ్ళికి డెకరేషన్ అవసరం ఏంటి? ఫిబ్రవరి 1న విడుదలయ్యే కృష్నార్జున వారి వర్రీ తీర్చే హిట్ అయితే, నాగార్జున ఆ సినిమాకు హెల్ప్ అయితే బాగుంటుందేమో.

We would like to hear your comments below: