చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న 149వ చిత్రానికి ఇప్పటికే ‘అధినాయకుడు’ అనే టైటిల్ దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. దర్శకుడి విషయమే ఇప్పటికీ తేలకుండా వుంది. వినాయక్, కృష్ణవంశీలలో ఒకరు ఈ సినిమాకి డైరెక్ట్ చేయనున్నారని ఇంతదాకా వార్తలొచ్చాయి. అయితే వినాయక్ ఆ రేసునుంచి తప్పుకుని ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ‘అధినాయకుడు’ని కృష్ణవంశీ దాదాపు డైరెక్ట్ చేయడం ఖాయమనుకునేంతలో తాజాగా మరో డైరెక్టర్ పేరు రంగం మీదికొచ్చింది. ఆ డైరెక్టర్ ఎన్. శంకర్. అతను ఇటీవలే దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ‘రామ్’ సినిమా తర్వాత అతను ఖాళీగానే వున్నాడు. ‘అధినాయకుడు’కి శంకర్ పేరు ఎందుకు పరిశీలనలోకి వచ్చిందీ వెల్లడి కాలేదు. ఏదేమైనా షూటింగ్ మొదలయ్యేదాకా డైరెక్టర్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే వుంటుంది.