అతి స్వల్ప కాలంలో ఖరీదైన ఐటమ్ గర్ల్‌గా మారిన ముమైత్ ఖాన్ తన మకాంను ముంబై నుంచి హైదరాబాద్‌కు మార్చింది. వంపు సొంపులే ప్రధాన ఎస్సెట్స్ అయిన ముమైత్ ఇప్పుడు కేవలం ఐటమ్స్‌కే పరిమితం కాకుండా హీరోయిన్ పాత్రల్నీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సినిమా వ్యక్తులు హైదరాబాద్‌లోని పబ్బులకి వెళ్లడం రివాజు. ముఖ్యంగా యువ నటీనటులు తరచూ పబ్బులలో దర్శనమిస్తుంటారు. ముమైత్కూడా ఇటీవలి కాలంలో పబ్బులలో కనిపిస్తోంది. ఆ పబ్బులలో ఆమెకి తోడుగా కనిపించే యువ నటులెవరో తెలుసా? రాజా, నవదీప్. ఫిల్మ్‌నగర్ వర్గాలు ఈ విషయమే చెప్పుకుంటున్నాయి. అయితే ఇటీవల పంజాగుట్ట ప్రాంతంలో వున్న ఒక పబ్బులో ముమైత్కూ, ఆ ఇద్దరు యువ హీరోలకూ మధ్య గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. బాగా తాగిన ముమైత్ అదుపుతప్పి రాజా, నవదీప్‌లను బూతులు తిట్టిందనీ, దాంతో వారు ఆగ్రహం పట్టలేక ఆమెపై చేయి కూడా చేసుకున్నారనేది కూడా ఆ ప్రచారంలో భాగం. ముమైత్ అంటే ముంబై అమ్మాయి. డిమాండ్ వున్నంత కాలం ఇక్కడ వుండి తిరిగి ముంబై వెళ్లిపోతుందనేది నిశ్చయం. కానీ హీరోగా కెరీర్‌ని ఆశిస్తూ కష్టపడుతున్న రాజా, నవదీప్ ఈ తరహా గొడవల్లో తలదూరిస్తే.. అది వారికే నష్టాన్ని కలిగిస్తుందని టాలీవుడ్ వర్గాల అభిప్రాయం.