ఇప్పుడు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చలామణీ అవుతున్న గాసిప్ ఇది. తన భర్తతో విడాకులు కోరుతున్న ఒక టాప్ టీవీ యాంకర్, నటి ఒక స్టార్ హోటల్లో తన ప్రియునితో శృంగారంలో మునిగి వుండగా దొరికిపోయిందనేది ఆ గాసిప్. ఆమెకు మూడేళ్ల పాప కూడా ఉంది. సినీ రంగానికే చెందిన భర్తతో వచ్చిన విభేదాల కారణంగా విడాకుల కోసం అమె కోర్టును ఆశ్రయించింది. కాగా ప్రస్తుత గాసిప్ ప్రకారం మూడు రోజుల క్రితం ఆమె తన ప్రియునితో కలిసి హోటల్ రూమ్‌లో వుండగా ఆ భర్త దానిని రహస్యంగా వీడియోలో రికార్డ్ చేశాడు. త్వరలోనే భార్య వద్ద ఉంటున్న తన కూతుర్ని తనకు అప్పగించాల్సిందిగా కోరుతూ అతను కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. తనమీద భర్తకి అనుమానాలు ఎక్కువ అవుతుండటంవల్లే ఆ టీవీ యాంకర్ అతన్నించి విడిపోవాలని కోరుకుంటోంది. చాలా కాలం నుంచే ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. యాంకర్‌గా మంచి డిమాండ్ ఉండటం వల్ల ఆర్థికంగా ఆమెకు ఎటువంటి ఇబ్బందీ లేదు. అయితే ఇప్పుడు ఆమె ప్రియునితో కలిసి తిరుగున్నదనీ, అందువల్ల తన కుమార్తె భవిష్యత్తు ఇబ్బందిపాలయ్యే అవకాశముందనీ, అందువల్ల తన కుమార్తెను తనకు అప్పగించాల్సిందిగా కోరడానికి ఆ వీడియోను భర్త ఉపయోగించుకునే అవకాశముంది. ఆ భర్త చెబుతున్న దాని ప్రకారం అతని భార్యకీ, ఆమె ప్రియునికీ మూడేళ్లనుంచీ సంబంధం కొనసాగుతూ వస్తోంది. ఈ గాసిప్‌లో ఎంత నిజముందో కొద్ది రోజులు ఆగితే తేలిపోతుంది.