త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘వరుడు’గా నటించేందుకు సిద్ధమవుతున్న మహేష్, ఆ సినిమాలో ప్రియాంకా చోప్రాను హీరోయిన్గా కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా ప్రచారమవుతున్న సంగతి ఇదే. ఈ సినిమాలో మొదట దీపికా పడుకోనే, ఇలియానా పేర్లు పరిశీలనలో వున్నట్లు వార్తలు వచ్చాయి. ‘ఓం శాంతి ఓం’ తెచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్లో యమ క్రేజ్‌నీ, సినిమాల్నీ సంపాదించుకుని బిజీగా వుండటం వల్ల ఇప్పట్లో తెలుగు సినిమా చేయలేనని దీపిక తేల్చేసింది. ఇలియానాతో ఇప్పటికే ‘పోకిరి’ని చేసి వున్నందున ఇంతదాకా చేయని తారతో నటించాలని మహేష్ భావిస్తున్నాడు. అందుకే ఇలియానాకు ‘నో’ చెప్పాడు. అతని కళ్లు మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా మీద పడ్డాయి. దాంతో త్రివిక్రమ్ ఆమెను సంప్రదించాడు. మహేష్ పేరు అప్పటికే వినివున్న ప్రియాంక ఈ ఆఫర్‌కు ఆనందం వ్యక్తం చేస్తూ మరో ఆరు నెలలు ఆగితే చేస్తానని తెలిపింది. మహేష్ అందుకు సరేననన్నాడు కూడా. అయితే త్రివిక్రమ్ మాత్రం అంతకాలం వెయిట్ చేసే స్థితిలో లేడు. అందుకే అతడిని కన్విన్స్ చేసి, ఒక ముంబై మోడల్‌ను సెలక్ట్ చేశాడు. ఆమె ఎవరో కాదు, మహేష్‌తో థమ్సప్ యాడ్‌లో చేసిన అమ్మాయే. కానీ మహేష్ మాత్రం ఆమెకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జూన్ తొలి వారంలోనే ‘వరుడు’ సెట్స్ మీదకు వెళ్తున్నందున హీరోయిన్ విషయాన్ని వీలైనంత తొందరగా తెమల్చాలని త్రివిక్రమ్, నిర్మాత శింగనమల రమేష్ భావిస్తున్నారు. అన్నట్లు ఇప్పటికే ఈ సినిమాలో రెండో హీరోయిన్గా పార్వతీ మెల్టన్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే కదా!