నిజమేనా? ఇప్పుడు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారమవుతున్న హాట్ హాట్ గాసిప్ ఇదే. తెలుగు అగ్ర హీరో మహేష్‌బాబు, తమిళ స్టార్ సూర్య కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారని జరుగుతున్న ప్రచారం టాక్ ఆఫ్ ద సినీ ఇండస్ట్రీ. టాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ‘వరుడు’ సినిమాను చేస్తున్న మహేష్ వచ్చే యేడాది ఈ మల్టీ స్టారర్‌ను చేయడానికి అంగీకరించాడు. ‘సాక్షి’ దినపత్రిక అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నాడు. దీనికి వివి వినాయక్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషలు రెండింటిలో ఏక కాలంలో ఈ సినిమా రూపొందనున్నది. సూర్య కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే గనుక వాస్తవ రూపం దాలిస్తే నిర్మాణానికి ముందే ఈ సినిమా మహా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనేని నిశ్చయం. కనీవినీ ఎరుగని రీతిలో బిజినెస్ అయ్యే అవకాశముంది. సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టడమే సంచలనాత్మకంగా వుండాలని వైఎస్ జగన్ భావించడమే ఈ ప్రాజెక్ట్‌కు కారణమని వినిపిస్తోంది.