మహేష్‌బాబు హీరోగా కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా సస్పెన్స్ వీడలేదు. నిజానికి ఈ సరికి ‘మిర్చి’ ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికీ దాని గురించిన సమాచారం స్పష్టంగా తెలియడం లేదు. కాగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సినిమా చేయనున్నట్లు మహేష్‌బాబు ఇప్పటికే స్వయంగా చెప్పిన సంగతి మనకు తెలుసు. అతనితో వీలైనంత త్వరగా సినిమా చేయాలని మహేష్ భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆ సినిమాకి ‘వరుడు’ అనే టైటిల్ నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శేఖర్ కమ్ముల శైలిలో రొమాంటిక్ ఠ్రిల్లర్గా ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చిత్రమాల అందజేస్తుంది.