ఎన్టీఆర్ హీరోగా ‘కంత్రి’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బానర్‌పై చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా మెహర్ రమేష్ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. తెలుగులో రమేష్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ కన్నడంలో ‘వీర కన్నడిగ’, ‘అజయ్’ అనే సక్సెస్ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండూ తెలుగు సినిమాలైన ‘ఆంధ్రావాలా’, ‘ఒక్కడు’ సినిమాలకు రీమేక్స్. హీరో చిరంజీవికి సమీప బంధువైన మెహర్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వద్ద అసోసియేట్‌గా చేశాడు. వాస్తవానికి ‘కంత్రి’ సబ్జెక్టుని అతను పవన్ కల్యాణ్ కోసం తయారు చేసుకున్నాడని టాలీవుడ్ అంతర్గత వర్గాల ద్వారా తెలిసింది. ఆ వర్గాల ప్రకారం పవన్ ఆ కథని సున్నితంగా తిరస్కరించాడు. దాంతో అల్లు అర్జున్‌తో ఆ సబ్జెక్టుని చేయాలని మెహర్ భావించాడు. కానీ అది కూడా వీలు పడలేదు. దాంతో ఎన్టీఆర్‌కు ఈ ప్రాజెక్ట్ వెళ్లింది. కథ విన్నవెంటనే మెహర్‌తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడు. అలా ‘కంత్రి’ మొదలయ్యిందనేది ఆ వర్గాల కథనం. విడుదలయ్యాక ‘కంత్రి’ హిట్టయితే ఎన్టీఆర్ జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో..