నిరుడు తేజ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో పరిచయమై, కృష్ణవంశీ రూపొందించిన ‘చందమామ’తో అందరి దృష్టినీ ఆకర్షించింది కాజల్ అగర్వాల్. గ్లామర్‌తో పాటు నటనా ప్రతిభ కూడా మెండుగా వున్నదనే ప్రశంసలు పొందింది. ఇప్పుడు ఏకంగా చిరంజీవి కుమారుడు రాంచరణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఎంపిక కావడంలో నాగబాబు రికమెండేషన్ వున్నదనే ప్రచారం జరిగింది. కారణం ‘చందమామ’లో తండ్రీ కూతుళ్లుగా నటించిన ఆ ఇద్దరి మధ్యా ఆ తరహా అనుబంధమే ఏర్పడటం. ఇప్పుడు నాగబాబు కుటుంబానికి ఆమె సన్నిహితం. అయితే ‘చందమామ’లో ఆమె నటన చూశాకే ఆమెను తన సినిమాలో రాంచరణ్‌కి జోడీగా ఎంపిక చేశానని దర్శకుడు రాజమౌళి చెప్పాడు. కాగా ఈ సినిమా షూటింగ్ మొదలై, రాంచరణ్‌తో సన్నివేశాలు చేస్తున్నప్పటి నుంచీ కాజల్ అతని ప్రేమలో కూరుకు పోయిందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన ప్రేమ సంగతిని ఇప్పటికే తన సన్నిహిత స్నేహితుల వద్ద ఆమె ప్రస్తావించిందనీ, రాంచరణ్‌కి చెప్పడానికి మాత్రం భయపడుతున్నదనేది ఆ ప్రచారంలో భాగం. రాంచరణ్‌తో పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాని పని అని సన్నిహితులు చెప్పడంతో కనీసం కొద్ది రోజులపాటైనా అతనితో డేటింగ్ చేయాలని ఆమె ఉబలాటపడుతున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. రాంచరణ్‌కి సంబంధించి ఈ తరహా గాసిప్స్ రావడం ఇదే ప్రథమం కాదు. ఆ మధ్య ‘చిరుత’ హీరోయిన్ను అతను ఢిల్లీలో పెళ్లి చేసుకున్నాడనే వదంతులు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం, దాన్ని రాంచరణ్ ఖండించి, సినీ తారలపై ఇలాంటి రూమర్లు మామూలేనని తేలిగ్గా తేల్చేయడం తెలిసిందే.