శేఖర్ కమ్ముల చేతిలో పడ్డ ఆ తారల సినీ భవిష్యత్ ఒక్కసారిగా మారిపోయింది. అందులో ప్రధాన పాత్రలు పోషించిన వాళ్లందరికీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రధాన జంటగా నటించిన వరుణ్ సందేశ్, తమన్నాలకే గాకుండా మిగిలిన వాళ్లు కూడా అవకాశాలు పొందుతున్నారు. వారిలో నిఖిల్ ప్రస్తుతం ‘అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్’ సినిమాలో అంకిత్‌గా హీరో పాత్రను చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్న ప్రచారమేమంటే అతనూ, ‘హ్యాపీడేస్’లో సంగీతగా నటించిన మోనాలీ చౌదరి కలిసి షికార్లు కొడుతున్నారని. మోనాలి ఇప్పుడు మాటీవీ సీరియల్ ‘యువ’లో ఒక ప్రధాన పాత్రను చేస్తోంది. నిఖిల్, మోనాలీ కలిసి తరచూ పబ్‌లలో దర్శనమిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్ చెప్పుకుంటున్నాయి. ఆ ఇద్దరూ ఒకరి సమక్షాన్ని మరొకరు బాగా ఇష్టపడుతున్నారనీ, చూస్తుంటే వారు ప్రేమలో పడినట్లే కనిపిస్తోందనీ అనుకుంటున్నారు. అది నిజమో, కాదో కొద్ది రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది.