Hansika demands 50 lakhs?

బాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు బాలనటిగా నటించిన హన్సిక మోత్వానీ అంతలోనే కథానాయికగా దేశముదురు చిత్రంతో పరిచయం అయింది. ఆపై హిమేష్ రేషమ్మియాతో కలిసి ఆప్‌కా సురూర్ చిత్రంలో నటించిన హన్సిక ప్రస్తుతం తెలుగు, హింది చిత్రాల మీద దృష్టి పెట్టింది. దేశ ముదురు తర్వాత మళ్లీ తెలుగులో నటించను అని చెప్పిన హన్సిక ఎన్టీఆర్‌తో కంత్రీ చిత్రంలో అవకాశం వచ్చే సరికి ఓకే అనేసింది. ఇకపై తెలుగు చిత్రాలలో నటించడానికి అభ్యంతరాలు ఏమీ లేవని అంటొన్న హన్సిక అందుకోసం నిర్మాతల మీద భారీ టేక్సే వేస్తోంది. తనతో సినిమా చేయాలి అనుకుంటే 50 లక్షలు చేత్తో పట్టుకుని రమ్మని హన్సిక చెప్తోందని ఫిలిం నగర్ టాక్. ఇటీవల ఒక యువ దర్శకుడు కథ చెప్పడానికి వెళితే కథ బాగుంది కానీ పారితోషికం గా 50 లక్షలు ఇస్తేనే నటిస్తాను అని చెప్పిందంట. ఇంకా తెలుగులో నిలదొక్కుకోక ముందే ఈమె ఇలా డిమాండ్ చేస్తుంటే ఇక స్టార్ అయ్యాక ఎంత అడుగుతుందో అని సినీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

We would like to hear your comments below: