చిరంజీవి తదుపరి సినిమా దర్శకుడు ఎవరు? ఇప్పటిదాకా వి.వి. వినాయక్ అనే అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా మంగళవారం వినాయక్ స్థానంలో గుణశేఖర్ పేరు వినిపించింది. అవినీతి మయమైన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి ఉద్యమించే ప్రజా నాయకుని కథతో ఈ సినిమా రూపొందనున్నది. ఇలాంటి కథకి డీల్ చేయడానికి వినాయక్ కంటే గుణశేఖర్ సరైనవాడని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి. హారిస్ జయరాజ్ సంగీత దర్శకుడు. జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.