A’gamya’gocharam!

అ’గమ్య’గోచరమ్!

‘పెళ్ళయింది కానీ..’ సినిమా బాక్సాఫీసు వద్ద ఫెయిల్ కావడం ‘గమ్యం’కి ఇబ్బందులు తీసుకొచ్చింది. దానికీ, దీనికీ సంబంధమేమిటి అంటారా.. ఉంది. ఆ సినిమాలో నరేశ్, కమలినీ ముఖర్జీ కలిసి నటించారు. ప్రేక్షకులు ఆ సినిమాని కాస్తకూడా ఆదరించలేదు. అదే జంట ‘గమ్యం’లోనూ నటించింది. సెంటిమెంట్లకు మొదటినుంచీ చిత్ర పరిశ్రమ ఆలవాలం అనే సంగతి మనకు తెలుసు. అందుకు అనుగుణంగానే ఈ సినిమావైపు కన్నెత్తి చూసేందుకు బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆర్. అనిల్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని అక్టోబరులో, సినిమాని నవంబరులో విడుదల చేయాలని మొదట భావించారు నిర్మాత జాగర్లమూడి సాయిబాబు. అయితే ప్రస్తుత పరిస్టులని బట్టి చూస్తే ‘గమ్యం’ విడుదల ఇప్పట్లో జరిగేట్లు లేదు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేశ్, కమలినితో బాటు శర్వానంద్ మరో ప్రధాన పాత్రని పోషించాడు. ఇదివరకు కమలిని, శర్వానంద్ జంటగా ‘క్లాస్ మేట్స్’లో నటించారు.

We would like to hear your comments below: