Frames tries for Mallanna rights!

శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ‘యమగోల మళ్లీ మొదలైంది’ సినిమాతో సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 2008 ప్రథమార్థంలో సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో ఓ పేరుపొందిన హీరో నటించనున్నట్లు తెలిసింది. ఈలోగా ఆ సంస్థ విక్రమ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మల్లన్న’ తెలుగు హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నది. విక్రమ్, శ్రియ జంటగా నటిస్తున్న ఈ సినిమాని సుశీ గణేషన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎస్. థాను నిర్మిస్తున్న ‘మల్లన్న’ నిర్మాణ ప్రారంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఈ సినిమా హక్కులని సొంతం చేసుకునేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఫ్రేమ్స్ సంస్థ ఫ్యాన్సీ అమౌంట్‌ని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

We would like to hear your comments below: