In – Films branding in Telugu Films..a sad note!!

In-Film Branding In Telugu Films… A Sad Note…

“ప్రభుదేవా లారెన్సుని పోటీలో నిలపడానికి నిరాకరిస్తాడు. అప్పుడు లారెన్స్ ప్రభుదేవాని ఛాలెంజ్ చేస్తాడు తనపై గెలవమని. ఇద్దరి మధ్యా డ్యాన్సుపోటీ మొదలవుతుంది. అదో ప్రభంజనం. దేశంలోని ఇద్దరు అద్భుతమైన డ్యాన్సర్లమధ్య అపురూపమైన పోటీ…” వీళ్ళిద్దరి వెనక Larger than life size ‘అడిడాస్’ హోర్డింగ్… పోటీ ముగిసింది. ఇద్దరూ గెలిచారు. ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకున్నారు. గౌరవంతో లారెన్సు, వాత్సల్యంతో ప్రభుదేవా… ఇద్దరూ కలిసి కెమెరా వైపు చూస్తూ చెప్పారు.. ‘అథ్లెటిక్సుకే కాదు.. డ్యాన్సుక్కూడా కావాలి.. పట్టు… యెస్.. The Adidas Grip’ (This is not the exact Script though…)

ఇది 2005 లో ‘Style’ మూవీ In-Film Branding టైఅప్ కోసం ‘అడిడాస్ కంపెనీకి నేను ప్రపోజ్ చేసిన ఐడియా. అంతా విన్నాక వాళ్ళ ఆలిండియా బ్రాండ్ మేనేజర్ హాండ్‌షేక్ ఇచ్చి చెప్పాడు ‘సూపర్బ్ రాజ్.. హిందీ మూవీకి ఇలాంటి ఐడియా పట్టుకురా, నేను చేస్తాను..’ అని. దీని తరవాత ఇంకా కొన్ని బ్రాండ్ ప్లేస్‌మెంట్స్ కోసం అడిగాం.. దాదాపుగా ఇదే జవాబు. కారణం, లోకల్ లెవెల్లో ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ కి వీళ్ళదగ్గర బడ్జెట్లు తక్కువగా ఉంటాయి. హైదరాబాద్‌లో మనవంటూ డెవలప్ అయిన బ్రాండ్స్ చాలా తక్కువ. ఏవో కళామందిర్, మీనా బజార్ లాంటి లోకల్ బ్రాండ్స్ తప్పించి నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయిన బ్రాండ్స్ లేవు. నేషనల్ బ్రాండ్స్ ఇక్కడ లోకల్‌గా చేసే Ad-Spending లో ఎక్కువ శాతం టీవీ, ప్రెస్, అవుట్‌డోర్, ఈవెంట్లు.. వీటికే అయిపోతూ ఉంటాయి. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు.

అయితే తప్పు బ్రాండ్స్ ఒక్కళ్ళదే కాదు, ప్రొడ్యూసర్లది కూడా.. చాలాసార్లు వాళ్ళిస్తామన్న డబ్బుకి నిర్మాతలు పదింతలు ఆశిస్తూ ఉండడంతో డీల్స్ ఫెయిలవుతూండటం నేను చూశాను. ఇంకో ఎగ్జాంపుల్ చెబ్తాను..

ఒక పెద్ద హీరో సినిమా కోసం బాంబేలోని ‘‘Sportscraft’ వాళ్ళతో టైఅప్ మాట్లాడి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ‘‘Dirt Race’ ప్లాన్ చేశాం. హైద్రాబాద్‌లో మొదటి డర్ట్ రేస్… ఇది ప్రీరిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్. అదే సమయంలో హీరో హోండా వాళ్ళు కొత్త మోడల్ బైక్ రిలీజ్ చేస్తూండడంతో వాళ్ళు ఈవెంటుని స్పాన్సర్ చేయడానికి ఒప్పుకున్నారు. మాటీవీ లైవ్ టెలీకాస్టుకి, డక్కన్ క్రానికల్ మీడియా పార్ట్నర్‌షిప్ కి ఒప్పుకున్నాయి. అంతా సెట్టయిందనుకున్న టైములో ప్రొడ్యూసరు పిలిచి ‘బాబుగారు రిలీజ్ తరవాత చేద్దామంటున్నారీ ఈవెంట్’ అన్నారు. రిలీజయ్యాక సినిమా హిట్టయిందంటే ప్రమోషనెందుకు అంటారు. ఫ్లాపవుతే స్పాన్సర్ ముందుకు రాడు. (ఫైనల్‌గా సినిమా ఫ్లాపయిందనుకోండి..) ఇదీ పరిస్థితి.

మన హీరోల యాటిట్యూడ్ – ఆ వొచ్చే బ్రాండ్లకి వీళ్ళేదో మోడలింగ్ చేసేస్తున్నామని. డైరక్టర్లేమో కథకు అడ్డం పడతాయని.. నిర్మాతలేమో హీరో రెమ్యునరేషనంతా ఈ బ్రాండింగుతో వొచ్చేయాలని. మొత్తం మీద అట్టహాసంగా మొదలైన ప్రయత్నాలు తుస్సుమంటూంటాయి. తెలుగులో గత పన్నెండేళ్ళుగా పెద్ద మార్పులేదు. మనకు కుదురుతోందల్లా ప్రమోషనల్ టైఅప్స్ మాత్రమే. అది కూడా ఆడియో ఈవెంట్ స్పాన్సర్ (లైవ్ టెలీకాస్ట్ ఉంటుంది కాబట్టి), కొన్ని హోర్డింగులు మాత్రమే. ఇన్-ఫిల్మ్ ప్లేస్‌మెంట్స్ మాత్రం – సినిమాలో ఎవడి ఫోను మోగినా వొచ్చే రింగ్‌టోనూ, లొకేషన్ కర్టెసీ, హీరో వాడే బైకు, ఫైట్ జరుగుతున్నప్పుడు వెనకెక్కడో ఉండే హోర్డింగు… ఇంతకన్నా ముందుకు వెళ్ళలేదు. (లక్సుపాప ఒక్కటి ఎక్సెప్షను)

Brand Association (Promotional)

సినిమా హోర్డింగుల మీద హోర్డింగ్ స్పాన్సర్ (ఉదా: చందనా బ్రదర్స్) 30 పర్సెంట్ స్పేస్ ఉంటే మిగతా భాగం సినిమా పోస్టర్ ఉంటుంది. హోర్డింగ్ రెంటు బ్రాండ్ పెట్టుకుంటే వినైల్ కాస్ట్ సినిమా ప్రొడ్యూసర్ పెట్టుకుంటాడు. చిన్న సినిమాలకి కూడా ఈ సపోర్ట్ ఇవ్వడానికి బ్రాండ్స్ ఒప్పుకోవడంతో గత అయిదారేళ్ళుగా చిన్న సినిమాల ప్రమోషన్‌కి ఉపయోగపడుతోంది. అయితే టీవీ యాడ్స్ లో మాత్రం ఆ సౌకర్యం లేదు.

దాదాపు పదిహేనేళ్ళ క్రితమే టీవీల్లో సినిమా ప్రోమోలని Entertainment Software గానే గుర్తించి వీటికి ప్రత్యేకమైన రేట్స్ కేటాయించారు. మిగతా కమర్షియల్ ప్రొడక్ట్స్ తో పోలుస్తే సినిమా ప్రోమో రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే హిందీ చానెళ్ళలో టీవీ ప్రోమోలలో కూడా బ్రాండ్ అసోసియేషన్ అద్భుతంగా సక్సెసయింది. బాలీవుడ్‌లో ఒక పెప్సీలాంటి బ్రాండ్ ఒక సినిమా క్లిప్పింగ్స్ తో కలిపి ఒక యాడ్ తయారు చెయ్యొచ్చు (హోర్డింగులో లాగా 30-70 అన్నమాట). టీవీ టైం కూడా సినిమా యాడ్స్ కిచ్చే రేట్ కార్డునే యూజ్ చేస్తారు. అదే తెలుగులో మాత్రం ఇలాంటి యాడ్స్ ని మామూలు కమర్షియల్ యాడ్‌గా పరిగణిస్తారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్లు, టీవీ చానెళ్ళ మధ్యలో ఏమన్నా చర్చలు జరిగాయో కూడా తెలీదు.

చెప్పొచ్చేదేమిటంటే, తెలుగు సినిమాల్లో ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ సక్సెసయిన దాఖలాలు తక్కువ. పొటెన్షియల్ ఎంతో ఉన్నా, చిత్తశుధ్ధి లేకపోవడమే దానిక్కారణం. టీవీలో వొచ్చే యాడ్స్ ని మనం చికాగ్గా రిమోట్‌తో మార్చేస్తాం, లేదా మ్యూట్ కొట్టేస్తాం. (ఈవెన్ యూట్యూబులో కూడా ఐదు సెకన్లు కాగానే ‘Skip Ad’ కొట్టేస్తాం..) కానీ సినిమాల్లో వొచ్చే బ్రాండ్ ప్లేస్‌మెంట్స్ మాత్రం చూసి తీరాల్సిందే. అందుకే హాలీవుడ్‌లో సినిమాకి ముఫ్ఫై నలభై బ్రాండ్లు, మిలియన్లలో రెవెన్యూలు, అలాగే బాలీవుడ్‌లో కూడా అదే సంఖ్యలో ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్ ఉండగా మనకి మాత్రం బ్రాండ్ అసోసియేషన్ ప్రమోషన్ దగ్గర మాత్రమే ఆగిపోతోంది.

ప్రేమికులని కలిపే కాఫీషాపు, విద్యార్థులకు ప్రేరణనిచ్చే కోలా డ్రింకు, పాతికేళ్ళ తరవాత స్కూల్‌మేట్స్ ని కలిపే మొబైల్ ఆపరేటరు, సామాజిక బాధ్యత గల కండోం బ్రాండూ, సమస్యలకి సమాధానంగా నిలిచే ఇన్ష్యూరెన్సు కంపెనీ… బ్రాండ్లలో ఎంతో డ్రామా ఉంది, కథలున్నాయి. కావాల్సిందల్లా శోధించగల దమ్ము, ఆసక్తి, కావాల్సిన సమయం. And of course, a damn good agent… All seriously lacking in India’s second biggest film industry…

1400449_10152062399395140_1559880762_o (1)

Raj Madiraju

Director, Telugu Film Industry

(Raj Madiraju is an award winning writer-director in Telugu Film Industry. His film ‘Rushi’ won critical acclaim in the recent times) 

We would like to hear your comments below: