నరేష్, ఫర్జానాల ప్రేమ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఆ ఇద్దరూ ఆరు నెలలుపైగా కలిసి తిరుగుతున్న సంగతి చిత్రసీమలోని పలువురికి తెలిసిన సంగతే. అయితే ఇటీవల తనకు ఫర్జానాతో ఎలాంటి ప్రేమానుబంధం లేదని నరేష్ చెప్పాడు. ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన పంజాబీ అమ్మాయి ఫర్జానా తన కెరీర్ మీద కాకుండా నరేష్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నదని ఫిల్మ్‌నగర్‌లో కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరి వ్యవహారం ఆమధ్య మీడియాకు కూడా ఎక్కింది. నరేష్, ఫర్జానా రెండు సినిమాల్లో జంటగా నటించారు. కాగా తనను ప్రేమిస్తున్నట్లు బహిరంగంగా ఒప్పుకోవాల్సిందిగా నరేష్‌పై ఫర్జానా ఒత్తిడి తెస్తున్నదనీ, లేదంటే ఆత్మయత్య చేసుకుంటానని కూడా బెదిరిస్తున్నదనీ గాసిప్స్ వినపడుతున్నాయి. తనను లైంగికంగా ఉపయోగించుకుని ఇప్పుడు తనతో సంబంధం లేదని చెబితే ఊరుకోనని ఆమె నరేష్‌ను హెచ్చరించిందనీ, ఈ వ్యవహారం నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణను కూడా ఇరకాటంలో పడేస్తున్నదనీ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతుందో వారికే ఎరుక.