ఇటీవల తెలుగు చలన చిత్రసీమకు చెందిన కొంతమంది ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఎవరి వద్దా అనుమానించదగ్గ రీతిలో ఏమీ దొరకలేదని వినిపించింది. కాగా తాజాగా ఫిల్మ్నగర్లో మరో ప్రచారం చలామణిలోకి వచ్చింది. దాని ప్రకారం దర్శకుడు వి.వి. వినాయక్ వద్ద అతని ఆస్తులకు సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు లభించాయి. బందరు పోర్టు వద్ద స్థలాలకి సంబంధించిన, అలాగే ఆయన చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లు సైతం ఐటి దాడిలో బయట పడ్డాయనీ, కానీ దీన్ని బయటకు రాకుండా గోప్యంగా వుంచారనీ ఫిల్మ్నగర్లో చెప్పుకుంటున్నారు. ‘ఆది’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వినాయక్ అతి స్వల్ప కాలంలోనే టాప్ డైరెక్టర్ల సరసన చోటు సంపాదించాడు. 2008లో తొలి హిట్ ఫిల్మ్ ‘కృష్ణ’ని డైరెక్ట్ చేసింది ఆయనే. కాగా మహేష్ ఇంట్లో ఐటి అధికారులకు కనీసం వెయ్యి రూపాయల నగదు కూడా లభించలేదని వినిపిస్తోంది.