Distributors unhappy with Lawrence

పోయిన శుక్రవారం (మే 23) విడుదలైన రాఘవ లారెన్స్ సినిమా ‘పార్థు’ ఇటు తెలుగులో, అటు తమిళంలో తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు ఆ సినిమాకు వచ్చిన స్పందన చూసిన డిస్ట్రిబ్యూటర్లు భవిష్యత్తులో అతని సినిమాల విషయంలో జాగ్రత్తగా వుండాలని నిర్ణయం తీసుకున్నారు. అతణ్ణి అనవసరంగా మోసేయకూడదని కూడా వారు భావిస్తున్నారు. అతను కొరియోగ్రాఫర్‌గా కొనసాగితేనే మంచిదనీ, అనవసరంగా అన్నిట్లోనూ వేలుపెట్టి చెడగొట్టుకుంటున్నాడనీ కొంతమంది భావిస్తున్నారు. తల్లి సెంటిమెంట్ మోతాదు మించిన ‘పార్థు’ సినిమా స్నేహ అభిమానుల్ని కూడా బాగా నిరుత్సాహ పరిచింది. పబ్లిసిటీ పరంగా చూస్తే, ఈ సినిమాకు జనాల్ని రప్పించింది స్నేహే. గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమా విడుదలకు ముందు పత్రికల్లో ప్రచురించిన స్నేహ స్టిల్స్ చాలామంది దృష్టిని ఆకర్షించాయి. ఆ స్టిల్స్‌లో స్నేహ బాగా ఎక్స్‌పోజ్ చేస్తోంది. ఆమె వొంపుసొంపులు స్పష్టంగా బహిర్గతమవుతూ కనిపించాయి. ఒక వాన పాట స్టిల్స్‌లో అయితే వొంటికి అతుక్కుపోయిన తెల్లటి చీరలోంచి ఆమె బ్రా, లంగా కూడా కనిపించాయి. దాంతో స్నేహ అందచందాలు చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు అసంతృప్తికి గురయ్యారు. అంతకు ముందు వారు పత్రికల్లో చూసిన ఎక్స్‌పోజింగ్ స్టిల్స్ ఏవీ సినిమాలో వారికి కనిపించలేదు. కాకపోతే మోడరన్ డ్రస్సుల్లో మాత్రం ఆమె దర్శనమిచ్చింది. అంతకుముందు స్నేహ పాత్ర, ఆమె గ్లామర్ సినిమాకి హైలైట్ అవుతాయని ఆ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షకుడిగా కూడా వ్యవహరించిన లారెన్స్ తెలిపాడు. కానీ అదంతా వట్టిదేనని ప్రేక్షకులు భావించారు. అందుకే అటు తమిళనాట, ఇటు తెలుగునాట.. రెండు చోట్లా సినిమాకు రెండో రోజునుంచే థియేటర్లు ఖాళీగా కనిపిస్తూ వస్తున్నాయి. లారెన్స్ ‘సక్సెస్ మీట్’ పెట్టి ఎంత గింజుకున్నా ప్రేక్షకులు పెరగలేదు. ఇదివరకు ‘స్టైల్’, ‘డాన్’ సినిమాల విషయాల్లో దెబ్బతిని వున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా లారెన్స్ ఓవరాక్షన్ మాని ఏదో ఒకపని మీదే ధ్యాసపెడితే బాగుంటుందని భావిస్తున్నారు.

We would like to hear your comments below: