Devendar Gaud: Bye to TDP, Hi to Chiru?

తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు, టీడీపీకి తెలంగాణా ప్రాంతంలో అత్యంత కీలకమయిన నాయకుడు దేవేందర్ గౌడ్ త్వరలో తెలుగుదేశం కి టాటా చెప్పేయనున్నారని రూమర్. కొంత కాలంగా దేవేందర్ గౌడ్ కి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు భోగట్టా. బీసీ నాయకుడిగా దేవేందర్ గౌడ్ కి ఉన్న పేరు, ప్రతిష్టాలకు తగ్గ ప్రాధాన్యం ఆయనకు సొంత పార్టీలో లభించడం లేదని అనుకుంటున్నారు. దేవేందర్ గౌడ్ బీసీ ల మీటింగ్ పెట్టిన నాదే చంద్రబాబు పార్టీ సమావేశం ఏర్పాటు చేసినపుడు ఈ విభేధాలు తొలిసారిగా బయటకు పొక్కాయి. ప్రత్యేక తెలంగాణా కై గట్టి పట్టు పడుతున్న దేవేందర్ గౌడ్ కి ఈ విషయంలో చంద్రబాబు వైఖరి నచ్చడం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ చంద్రబాబు తెలంగాణా అంశంలో ఎటూ తేల్చకుండా ఉండడం, మరోవైపు ఆంధ్ర ప్రాంత నేత అయిన యనమల రామకృష్ణుడుతో వైరం వగైరా దేవేందర్ కి సరిపడడం లేదంట. అయితే చిరంజీవి పార్టీ పెడితే దేవేందర్ అటుగా వెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయని అవే వర్గాలు అంటున్నాయి. చిరంజీవి పార్టీ పెడితే దానికి తెలంగాణా నుంచి బలమయిన నాయకుడి లోటు ఉంటుంది కనుక ఆ చోటు భర్తీ చేసి చిరు పార్టీలో ముఖ్య పాత్ర పోషించాలని గౌడ్ ఆలోచన అట. చిరంజీవి ప్రత్యేక తెలంగాణకు సుముఖంగానే ఉంటారు కనుక గౌడ్ కి ఆయనతో చేతులు కలపడానికి పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చునని చెప్పుకుంటున్నారు. చిరు పార్టీ పెడితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు.

We would like to hear your comments below: