చిరంజీవి కుమార్తె శ్రీజ వివాహ వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో నవ జంటకు ఆయన అండ దండలు అందాయని, ఆయన సహకారంతోనే ఫేమస్ లాయర్ పింకీ ఆనంద్ ఈ కేసు వాదించారని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘తైమ్స్ ఆఫ్ ఇండియా’ మెయిన్ పేపర్లో రాసింది. దాసరి ఈ పెళ్లిని సప్పోర్ట్ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, కేస్ట్ పాలిటిక్స్ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించాయని ఆ పత్రిక పేర్కొంది. కాపుల్లో రాజకీయ పరంగా ఉన్నత స్థానంలో ఉన్న దాసారికి చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ప్రాముఖ్యత తగ్గుతుందని, అతడిని బరిలోంచి తప్పించేందుకు ఇదంతా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దాసరి ఆఫీస్ నుంచే శ్రీజ, శిరీష్ ఇద్దరికీ కావాల్సిన సదుపాయాలు అందాయని, వారు తరచూ ఆయన నివాసం వద్ద కనిపించారని అంటున్నారు. అయితే ఈ ఆరోపణలు బలపరిచేందుకు చిరంజీవి గానీ, ఖండించేందుకు దాసరి కానీ అందుబాటులో లేరు.