Cine director weds tv anchor?

నేడు ఫిలింనగర్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న గాసిప్ ఓ సినీ దర్శకుడు, ఓ టీవీ తారని పెళ్ళి చేసుకున్నాడనేది. రాంగోపాల్‌వర్మ క్యాంపులో నుంచి వచ్చి, మొదట సినిమాటోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న అతను మూడు నాలుగేళ్ల క్రితం దర్శకుడిగా మారి, ఓ క్లాస్ సినిమాని తీశాడు. ఆ తర్వాత ఓ మాస్ హీరోని డైరెక్ట్ చేసిన అతను ప్రస్తుతం కొత్త హీరో హీరోయిన్లతో ఓ ప్రేమ కథాచిత్రాన్ని తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, అమెరికాలలో జరిగింది. ఇక టీవీ తార విషయానికి వస్తే.. టీవీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె, కొద్ది కాలం క్రితం గోపీచంద్ హీరోగా నటించిన ఓ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా మంచి కామెడీని పంచింది. కానీ ఆ తర్వాత ఆమె ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె ఆ దర్శకుడి సినిమాలో నటిస్తోంది. అలా ఒకరి మనసు ఒకరు తెలుసుకున్న ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న కథనం. అది కేవలం గాసిప్పా లేక వాస్తవమా అన్న సంగతి తేలాలంటే కొద్ది సమయం పడుతుంది.

We would like to hear your comments below: