Chiru consults Nadi astrologists?

చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ప్రతిరోజూ ఎన్ని వార్తలు, ఊహాగానాలూ వస్తున్నాయో తెలిసిందే. చిరంజీవి కాలు బయటపెడితే అదో వార్తై కూర్చుంటోంది. బయటి పనుల్ని ఆయన పెద్ద తమ్ముడు నాగబాబు చూసుకుంటూ వుండగా, అంతర్గత వ్యవహారాల్ని ఆయన బావమరిది అల్లు అరవింద్, పెద్ద కుమార్తె సుస్మిత పర్యవేక్షిస్తున్నారు. కాగా రాజకీయాల్లోకి వస్తే తన భవిష్యత్తు ఎలా వుంటుందనే సంగతి తెలుసుకోవడానికి చిరంజీవి నాడి జ్యోతిష్కుల్ని సంప్రదిస్తున్నారనేది తాజా వార్త. తమిళనాడులోని చిదంబరం సమీపంలో వున్న వైదీశ్వరన్‌కోయిల్ అనే ప్రాంతం నాడీ జ్యోతిష్యానికి ప్రఖ్యాతి గాంచింది. ఇటీవల చిరంజీవి అక్కడకు వెళ్లి వచ్చారని అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అక్కడి జ్యోతిష్కులు ఆయన జన్మ నక్షత్ర వివరాల్నీ, బొటనవేలి ముద్రనీ తీసుకున్నారనీ, త్వరలో ఆయన మరోసారి అక్కడకు వెళ్లి, తన భవిష్యత్ వివరాల్ని తెలుసుకోనున్నారనీ వినిపిస్తోంది. వివిధ రకాల జ్యోతిష్యంలో నాడీ జ్యోతిష్యానికి చాలా పేరుంది. ఇందులో భవిష్యత్తును మిగతా వాటికంటే ఖచ్చితంగా చెప్పగలుగుతారని చెప్పుకుంటూ వుంటారు. బహుశా అందువల్లే చిరంజీవి అక్కడకు వెళ్లి వుండొచ్చు. అక్కడి ఫలితాల్ని బట్టి ఆయన తన భవిష్యత్ కార్యకలాపాల్ని మలుచుకునే అవకాశాలు వుంటాయని అంతర్గత వర్గాల భోగట్టా. 

We would like to hear your comments below: