Chiru fans irked by Sirish

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ను ప్రేమ పెళ్లి చేసుకుని తమ అభిమాన నాయకుడి మనసు కష్ట పెట్టాడని శిరీష్ పై కోపంగానే ఉన్నా కానీ, అది చిరంజీవి పర్సనల్ ఇష్యూ కనుక ఫ్యాన్స్ అంతగా పట్టించుకోలేదు. అయితే శిరీష్ మాత్రం వారిని ప్రతీసారి ఏదో విధంగా రెచ్చగొట్టేలానే మాట్లాడుతున్నాడు. చిరంజీవి పై గౌరవ భావాన్ని కనబరచని శిరీష్ ఒక్కో సారి చిరంజీవి విషయంలో చాలా హర్టింగ్ గా వ్యాఖ్యలు చేస్తున్నాడు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఆయనను సపోర్ట్ చేస్తారా అని మీడియా అడిగిన పిచ్చి ప్రశ్నకు శిరీష్ ఇచ్చిన తిక్క సమాధానం మెగా ఫాన్స్ ను హర్ట్ చేసింది.చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే ఆ పార్టీ అజెండా తెలిశాక, తెలంగాణా, మైనార్టీ కోటాపై ఆయన స్టాండ్ ఏమిటో గమనించాక ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను అని శిరీష్ పక్కా రాజకీయ నాయకుడిలా ఇచ్చిన సమాధానం చిరంజీవి అభిమానులని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఏ ఇద్దరు మెగా ఫాన్స్ కలిసినా శిరీష్ సమాధానం గురించే చర్చించుకుని అతడిని దుమ్మెత్తి పోస్తున్నారు. శిరీష్ వైఖరి చూస్తొంటే చిరంజీవి పార్టీ పెట్టిన పక్షంలో ముందు ముందు మరిన్ని డ్యామేజింగ్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేటట్టే కనిపిస్తోంది.

We would like to hear your comments below: