Chiranjeevi spending money on publicity?

చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం గురించి ముందుగా బ్రేక్ చేసినది ఎవరో అందరికీ తెలుసు. ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి పుంఖాను పుంఖాలుగా రాస్తున్నదీ, ఆయన స్వయంగా ప్రకటిస్తానని అని కూడా ఆపకుండా ప్రచారం చేస్తున్నదీ ఎవరో గమనించే ఉంటారు. ఒక ప్రముఖ దిన పత్రిక చిరుని కింగ్ మేకర్ చేయడం వెనుక ప్రధాన పాత్ర పోషించాలని చూస్తోందట. చిరంజీవి కూడా తనకు మీడియా సపోర్ట్ ఉండడం ముఖ్యమని భావిస్తున్నారు కనుక, తనకంటూ సపోర్ట్‌గా నిలిచే స్ట్రాంగ్ పేపర్ ఒకటి ఉండాలని భావించారట. అందుకే ఆ పత్రికతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారని, కాంప్లిమెంట్‌గా కొంత డబ్బు కూడా చెల్లించారని, చెల్లిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి చిరు రాజకీయ ప్రవేశంపై ఈ పత్రిక ఉత్సాహం చూపించడం ఇదే ప్రథమం కాదు. లోగడ ఒక సారి ప్రత్యేక తెలంగాణా వస్తే ఆంధ్ర నుంచి చిరంజీవి ఇంద్ర పార్టీ పెడతారని ఆ పత్రికే మెయిన్ పేజీలో రాసింది. అది పెద్ద దుమారం రేపితే ఆ వార్తపై వివరణ ఇవ్వడానికి చిరంజీవి ప్రెస్‌ను పిలిచి, హైడ్రామా అనంతరం వివరణ ఇవ్వకుండానే చివరి నిమిషంలో ప్రెస్ మీట్ కేన్సిల్ చేసేసారు. దాంతో ఆ వార్త చిరంజీవికి తెలిసే ప్రచురణ అయిందని చెప్పుకున్నారు. కేవలం చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి మాత్రమే కాకుండా, శ్రీజ పెళ్లి తర్వాత కూడా ఆ పత్రిక చిరంజీవికి అనుకూలంగా పలు కథనాలు ప్రచురించింది. ఇదిలా ఉండగా కొన్ని వార్తా చానళ్లు కూడా చిరు సపోర్టర్స్‌గా ఉండేందుకు బాగా ఉత్సాహం చూపిస్తున్నాయి. చిరు దృష్టిని ఆకర్షించి ఆయన ద్వారానే అఫీషియల్ మీడియా పార్టనర్స్‌గా గుర్తింపు పొందాలని మూడు చానల్స్ పోటీలు పడుతున్నాయని తెలుస్తోంది. వీరంతా కలిసి తీర్మానించిన తాజా విశేషం ఏంటంటే కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చినా కానీ చిరంజీవి పార్టీ స్థాపనకు అవి ఆటంకం కాబోవట!

We would like to hear your comments below: